దేశీగాళ్‌ సౌత్‌ సందడికి సమయం ఆసన్నమైందా?

మరిన్ని వార్తలు

దేశీగాళ్‌, గ్లోబర్‌ స్టార్‌ అంటూ ముద్దుగా పిలచుకునే ముద్దుగుమ్మ ప్రియాంకా చోప్రా సినీ కెరీర్‌ సౌత్‌ సినిమాతోనే స్టార్ట్‌ అయ్యింది. ఆమె తమిళంలో 'తమిజాన్‌' సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో 'ది హీరో' మూవీలో ఛాన్స్‌ దక్కించుకుంది. అంతే ఆ పై ఇక సౌత్‌ వైపు కన్నెత్తి చూడలేదు. బాలీవుడ్‌లో వరుస అవకాశాలతో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందింది. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. సెన్సేషనల్‌ హీరోయిన్‌గా పేర్గాంచింది. బాలీవుడ్‌లో బిజీగా ఉంటూనే హాలీవుడ్‌నీ టచ్‌ చేసింది.

 

అక్కడ కూడా మంచి మంచి ఆఫర్లు అందుకుంది. 'బేవాచ్‌' చిత్రం ద్వారా హాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అక్కడ కూడా మంచి మంచి ఆఫర్లు దక్కించుకుంది. నటిగానే కాకుండా, నిర్మాతగానూ అభిరుచి గల చిత్రాలను రూపొందించింది ప్రియాంకా చోప్రా. ఇక ఇప్పుడు ప్రాధాన్యత ఉన్న సినిమాలపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న 'ది స్కై ఈజ్‌ పింక్‌' చిత్రం నిర్మాణ దశలో ఉంది. ఈ సినిమాకి నిర్మాతగానూ వ్యవహరిస్తోంది ప్రియాంకా చోప్రా. ఇదిలా ఉంటే, ప్రియాంక సౌత్‌లో అడుగుపెట్టేందుకు సమయం ఆసన్నమైందని తెలుస్తోంది. మంచి కథ, ఆసక్తి కలిగించే పాత్ర దొరికితే, సౌత్‌లో నటిస్తానని ప్రియాంకా ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. అంటే, త్వరలోనే ప్రియాంకా సౌత్‌ ఎంట్రీ షురూ కానుందన్న మాట.

 

తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి ఫుల్‌ ఛార్జ్‌లో ఉన్నారిప్పుడు. ఆల్రెడీ రీఎంట్రీలో రెండు సినిమాలతో సత్తా చాటారాయన. ఇక మూడో సినిమా రేపో మాపో సెట్స్‌ మీదికెళ్లనుంది. దీంతో పాటు మరో రెండు ప్రాజెక్టులు చిరంజీవి చేతిలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయా సినిమాల్లో చిరంజీవితో కలిసి నటించే హీరోయిన్స్‌ కోసం వేట కొనసాగుతోంది. ఒకవేళ మెగాస్టార్‌ సినిమాతోనే ప్రియాంకా ఎంట్రీ షురూ అవుతుందేమో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS