‘ఉయ్యాల జంపాల’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ముద్దుగుమ్మ అవికా గోర్. అంతకు ముందే, ‘చిన్నారి పెళ్ళికూతురు’ అనే డబ్బింగ్ సీరియల్‌తో తెలుగునాట బుల్లితెర వీక్షకుల్లో చెరగని ముద్ర వేసిన అవిక, ఆ తర్వాత వెండితెరపైనా ఓ వెలుగు వెలిగింది. చెప్పుకోవడానికి సంఖ్యా పరంగా బాగానే సినిమాలు చేసినా, అందులో కొన్ని సక్సెస్‌లు వున్నా, ఎందుకో ఈ బ్యూటీకి రావాల్సిన స్థాయిలో స్టార్‌డమ్ రాలేదు. బహుశా గ్లామర్ పరంగా పెట్టుకున్న కుట్టబాట్లే దానికి కారణం కావొచ్చని ఈ బ్యూటీ అనుకుందేమో.. చాలా కష్టపడి తన ‘బొద్దు’ అవతారం మార్చి, స్లివ్‌ుగా తయారైంది. ఈ క్రమంలో తనకు ‘ట్రోలింగ్’ కూడా ఉపయోగపడిందని చెబుతోంది అవికా గోర్. తన గ్లామర్ గురించి చాలా ట్రోల్స్ చూశాననీ, ఈ నేపథ్యంలోనే తనను తాను పూర్తిగా మార్చేసుకోవాలనుకున్నాననీ అవికా గోర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
ఇప్పుడు అవిక చాలా స్లిమ్ గా కన్పిస్తోంది కూడా. అదే సమయంలో, కొంచెం గ్లామర్ డోస్ కూడా పెంచింది. ఇవన్నీ ఓ ఎత్తు.. డాన్సుల్లో ప్రావీణ్యం ఇంకో ఎత్తు. ఈ మధ్యకాలంలో మోడ్రన్ డాన్స్‌లను ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ వచ్చిందట అవిక. డాన్సుల్లో మొదటి నుంచీ తనకు మంచి ప్రావీణ్యం వుందనీ, ఇప్పుడు అది మరింత ఈజ్ వచ్చిందనీ అంటోంది అవిక. ప్రస్తుతం సెల్ఫ్ క్వారంటైన్ లైఫ్‌లో కూడా డాన్స్‌నే ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తోందట అవికా గోర్. డాన్స్‌తోపాటు స్విమ్మింగ్ కూడా తాను సన్నబడ్డానికి కారణమని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ.