కరోనా వైరస్ దెబ్బకి తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర ఆందోళన చెందుతోంది. ఫలానా సినిమా ఆగిపోయిందట.. ఫలానా సినిమా ది¸యేటర్లలో కాకుండా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ మీద విడుదల కాబోతోందట.. అంటూ వస్తున్న గాసిప్స్ సినీ పరిశ్రమని కరోనా కంటే దారుణంగా దెబ్బతీసేలా వున్నాయి. తాజాగా, సాయిధరమ్ తేజ్ - దేవ్ కట్టా కాంబినేషన్‌లో రూపొందాల్సిన సినిమాపై రూమర్స్ షురూ అయ్యాయి. దాంతో, చిత్ర నిర్మాణ సంస్థ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. సినిమా ఆగిపోలదనీ, కరోనా వైరస్ సద్దుమణిగాక సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని చిత్ర నిర్మాణ సంస్థ పేర్కొంది. దేవ్ కట్టా దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించనున్న ఈ సినిమా ప్రారంభోత్సవం ఇటీవలే లాంఛనంగా జరిగింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిది¸గా హాజరయ్యారు. నివేదా పేతురాజ్ ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ సరసన హీరోయిన్‌గా నటించనుంది. ఇదిలా వుంటే, సాయిధరమ్ తేజ్ హీరోగా మరో చిత్రం రూపొందుతోంది. అదే ‘సోలో బ్రతుకే సో బెటర్’. సుబ్బు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. నభా నటేష్, సాయిధరమ్ తేజ్‌తో ఈ సినిమా కోసం ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తోంది. కాగా, కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో జూన్ లోపు సినిమా రిలీజులపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. జూన్ తర్వాతే సినిమా రిలీజ్‌లు వుండొచ్చని భావిస్తున్నారు. పరిస్థితులు సద్దుమణిగితే, ఇప్పటికే రిలీజ్‌కి సిద్ధంగా వున్న సినిమాలు ది¸యేటర్లలోకి ఇంకా ముందే వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.