పోయిన వారం మూడు చిత్రాలు విడుదలైతే ఈ వారం ఒకటి తక్కువగా రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకి వచ్చాయి. ఇక ఈ రెండు చిత్రాలు తీసింది మొదటి చిత్రం తీసిన దర్శకులు కావడం విశేషం. ఒకటి- మంజుల దర్శకత్వం వహించిన ‘మనసుకు నచ్చింది’, రెండవది ప్రశాంత్ వర్మ తీసిన ‘అ’.
ఇక ముందుగా మంజుల ‘మనసుకు నచ్చింది’ గురించి మాట్లాడుకుంటే- ఈ చిత్రం కథ పాతదైనప్పటికీ కథనం పరంగా ఆమె ఈ చిత్రాన్ని అందమైన లోకేషన్స్ అలాగే ఎక్కువగా ప్రకృతిని ఈ కథకి ముడిపెడుతూ తీసే ప్రయత్నం చేశారు. అయితే ఆమె ప్రయత్నం సత్ఫలితాన్ని ఇవ్వలేదు అనే చెప్పాలి.
మొదటి షో నుండే ఈ సినిమా పైన అందరు పెదవి విరిస్తున్నారు. నటిగా, నిర్మాతగా సక్సెస్ కొట్టినప్పటికీ దర్శకురాలిగా మాత్రం మొదటి చిత్రం విజయాన్ని ఇవ్వలేకపోయింది. రెండవ సినిమాతో అయినా సక్సెస్ కొట్టాలని కోరుకుందాము.
ఇక ముందునుండే 'అ' ఒక వైవిధ్యమైన చిత్రం అందుకే హీరో నాని నిర్మాతగా మారి ఈ సినిమా తీసాడు అలాగే టాప్ హీరోయిన్లు ఇందులో నటించారు అని ప్రచారం జరిగింది. ఇవన్ని కూడా నూటికి నూరుపాళ్ళు నిజం అని ఈ చిత్రం విడుదలయ్యాక మనకి తెలుస్తుంది.
కచ్చితంగా ఇది ఒక కొత్త కాన్సెప్ట్ అని చెప్పొచ్చు.
అలాగే దర్శకుడు ప్రశాంత్ వర్మ తనలోని ప్రతిభని ఈ చిత్రం ద్వారా తెరపైన అందరికి చూపెట్టేశాడు. ముఖ్యంగా అందరు ఈ చిత్రం క్లైమాక్స్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ సినిమా కమర్షియల్ రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ ఇది ఒక మంచి చిత్రంగా అయితే నిలిచిపోయింది.
ఇది ఈ వారం www.iQlikmovies.com టాక్ అఫ్ ది వీక్.