తెలుగు వెండితెర పైన ఒక వైవిధ్యమైన చిత్రంగా ‘అ’ ప్రదర్శింపబడుతున్నది.
ఈ చిత్రంలోని కంటెంట్ కి అలాగే దర్శకుడు ప్రశాంత్ తీసిన విధానంతో ప్రేక్షకులు సినిమా చూస్తున్నంతసేపు అలాగే చూసాక కూడా ‘అ’ అనేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ఇండియాలో కన్నా ఓవర్సీస్ లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇందుకు కారణం, ఓవర్సీస్ లో ఇటువంటి వైవిధ్యమైన చిత్రాలకి మార్కెట్ ఎక్కువగా ఉండటమే ప్రధాన కారణం. విడుదలైన మూడు రోజుల్లో అక్కడ ఈ చిత్రం దాదాపుగా రూ 3 నుండి రూ 3.5 కోట్ల వరకు వసూలు చేసింది. కచ్చితంగా ఈ చిత్రం 1 మిలియన్ మార్క్ దాటుతుంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ ‘అ’ చిత్రం మూడు రోజుల్లో రూ 9 కోట్ల (గ్రాస్) మేర వసూళ్ళు సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతున్నది.
చూద్దాం.. ఈ చిత్రం ఎంతవరకు కలెక్షన్స్ రాబట్టగలదో..