అయ్యప్పన్ కోషియమ్.. ఈ రీమేక్ టాక్ ఆఫ్ టాలీవుడ్ అయ్యింది. బాలకృష్ణతో ఈ సినిమా చేస్తారని తెలిసినప్పటి నుంచీ అయ్యప్పన్ కోషియమ్ గురించి మాట్లాడుకోవడం మొలెట్టారు సినీ జనాలు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ సినిమా రైట్స్ సొంతం చేసుకుంది. దానికి సంబంధించిన ఎగ్రిమెంట్లు కూడా జరిగిపోయాయి. ఈ రీమేక్ రైట్స్‌ని 1.05 కోట్లకు కొనుగోలు చేశారని టాక్. నిజానికి ఇది తక్కువ మొత్తమే. మన తెలుగు సినిమాల్ని ఏ భాషలో రీమేక్ చేయాలన్నా కోట్లకు కోట్లు గుంజేస్తారు.
`అల వైకుంఠపురములో` సినిమా రీమేక్ రైట్స్ ఏడు కోట్లకు అమ్ముడుపోయిన సంగతి గుర్తుండే ఉంటుంది. కాకపోతే... మలయాళం సినిమాలు తక్కువ రేటు పలుకుతాయి. అయితే మరీ ఇంత తక్కువకు ఈ సినిమాని కొనేయడం హారిక హాసిని సంస్థకే చెల్లింది. బాలకృష్ణ - రానా కలిసి నటించే అవకాశాలున్నాయి. అయితే.. దర్శకుడు ఎవరన్నది ఇంత వరకూ తేలలేదు. ఓ యువ దర్శకుడే ఈ ప్రాజెక్టుని డీల్ చేసే అవకాశం ఉంది.