బి.జయ. ప్రామిసింగ్ మహిళా దర్శకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 'చంటిగాడు', 'లవ్ లీ' తదితర సినిమాలతో బి.జయ తనకంటూ దర్శకురాలిగా ఓ ప్రత్యేకతను సాధించుకోవడం జరిగింది. ఈమె దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'వైశాఖం' విడుదలకు సిద్ధమవుతోంది. హీరో హీరోయిన్లు కొత్తవారే కావడం సినిమాకి ప్లస్ అయ్యిందంటారు జయ. హరీష్, అవంతిక జంటగా నటించారు ఈ సినిమాలో. కొత్త నటీనటుల కారణంగానే సినిమాకి ఆ ఫ్రెష్‌నెస్ వచ్చిందని జయ చెప్పారు. అపార్ట్మెంట్ నేపథ్యంలో సాగే కథ అట. టైటిల్‌కి తగ్గట్లుగానే చాలా ఆహ్లాదంగా ఉంటుందంటున్నారు సినిమా. ఫ్యామిలీతో కలిసి కూర్చుని చూడదగ్గ సినిమాలు మాయమైపోయిన నేటి తరుణంలో, 'వైశాఖం' ఫ్యామిలీ మొత్తం కూర్చుని హాయిగా తిలకించేలా సినిమా అవుతుందంటున్నారు ఈ డైనమిక్ డైరెక్టర్ జయ. జులై 21న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాలో సాయికుమార్ కీలక పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమా తర్వాత నాగచైతన్యతో ఓ సినిమా చేయాలనుకుంటున్నట్లు జయ చెప్పారు. మంచి కథ తీసుకొస్తే, జయ దర్శకత్వంలో సినిమా చేస్తానని నాగచైతన్య కూడా ఇటీవల చెప్పాడు. నాగచైతన్య కోసం కథ వేటలో పడ్డారట జయ. అన్నీ కుదిరితే జయ దర్శకత్వంలో తదుపరి సినిమా నాగచైతన్య హీరోగానే కావొచ్చు. నాగ చైతన్య కెరీర్ బెస్ట్ మూవీ అయ్యేలా మంచి కథని సిద్దం చేసేందుకు కసరత్తులు మొదలెట్టేశారట బి.జయ.