రీల్ లైఫ్ లో హీరోగా ఉండడం కన్నా రియల్ లైఫ్ లో హీరోగా ఉండడం చాలా కష్టం. కాని ఓ కన్నడ హీరో మాత్రం, తాను రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో సైతం హీరోనే అని నిరూపించుకున్నాడు.
వివరాల్లోకి వెళితే, కన్నడ హీరో సుదీప్ తన రాబోయే పుట్టినరోజున అభిమానులెవరు పూలదండలు, కేకులు తీసుకొని తన వద్దకు రావొద్దని విజ్ఞప్తి చేశాడు. దానికి బదులు అదే డబ్బుతో ఆకలితో ఉన్న కుటుంబంకి అన్నం పెట్టండి అంటూ తన ఫ్యాన్స్ ని కోరాడు.
తన పుట్టినరోజు కోసం పెట్టే ఖర్చుని ఈ విధంగా పదిమందికి ఉపయోగపడేలా చేయమని అలా చేస్తేనే తనకి సంతృప్తి కలుగుతుంది అని చెప్పాడు. తన ఫ్యాన్స్ అందరు నలుగురికి ఉపయోగపడితే తనకి అదే ఆనందం అని చెప్పాడు.