బాహుబలి చిత్రం రెండు భాగాలు ఎంతటి ఘన విజయాన్ని సాధించాయో ప్రత్యేకంగా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు.
ఇక ఇంతటి ఘన విజయం సాధించిన బాహుబలికి మరో ఘనత లభించింది. అదేమనగా- మన దేశంలో ఈ సంవత్సరపు ఎక్కువగా సెర్చ్ చేసిన అంశంగా బాహుబలి- 2 చిత్రం మొదటి స్థానంలో నిలిచింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే బాహుబలి 2 సినిమా 7వ స్థానంలో నిలిచిందట.
ఇంతటి ఘనత సాధించడానికి కారణమైన ప్రేక్షకులకి బాహుబలి యూనిట్ కృతజ్ఞతలు తెలిపింది. ఇక విమర్శకుల చేత ప్రశంసలు, ప్రేక్షకుల చేత బ్రహ్మరధంతో పాటుగా ఈ పాపులర్ సెర్చ్ ఘనత కూడా సాధించడం నిజంగా ఒక గొప్ప విషయం అని ఒప్పుకోక తప్పదు.
మొత్తానికి బాహుబలి బాక్స్ ఆఫీస్ వద్దనే కాక అంతర్జాలంలో సైతం తన సత్తా చాటింది. దీనంతటికి ముఖ్య కారణం దర్శకుడు రాజమౌళి అనే వేరే చెప్పకర్లేదు కదా...