ఇంతవరకూ ఏ తెలుగు సినిమా హిందీ సినిమాతో పోటీ పడింది లేదు. కనీ వినీ ఎరుగని అద్భుతం ఇది. 'బాహుబలి ది కన్‌క్లూజన్' సినిమా హిందీ వెర్షన్ ఇప్పటి వరకూ ఉన్న బాలీవుడ్ చిత్రాల రికార్డుల్ని కొల్లగొట్టేసింది. ఇంతవరకూ బాలీవుడ్‌లో అమీర్ ఖాన్ నటించిన 'దంగల్' సినిమా వసూళ్ల పరంగా నెంబర్ వన్ పొజిషన్‌లో ఉంది. ఆ ప్లేస్‌ని ఇప్పుడు మన తెలుగు సినిమా 'బాహుబలి ది కన్‌క్లూజన్' కొల్లగొట్టేసింది. దాంతో 'దంగల్' సెకండ్ ప్లేస్‌కి వెళ్లిపోయింది. ఫస్ట్ వీక్‌లో 'బాహుబలి ది కన్‌క్లూజన్' హిందీ వెర్షన్ సాధించిన కలెక్షన్ అక్షరాలా 247 కోట్లు. ఒక తెలుగు సినిమాకి హిందీలో ఇంత ఆదరణ లభించడం ఇదే తొలిసారి. ఇలాంటి అద్భుతం ఇకపై భవిష్యత్తుల్లో జరుగుతుందనడానికి కూడా గ్యారంటీ లేదు. ఆ స్థాయిలో 'బాహుబలి ది కన్‌క్లూజన్' సంచలనం సృష్టించింది. టాప్ పొజిషన్‌లో ఉన్న 'దంగల్', సుల్తాన్' సినిమాల లాంగ్ రన్ రికార్డుల్ని కూడా 'బాహుబలి' సినిమా కొల్లగొట్టేందుకు రెడీగానే ఉంది. సినిమా విడుదల నాటి నుండీ ప్రతీ రోజు లెక్కలు చూస్తుంటే ట్రేడ్ పండితులే ఆశ్చర్యానికి గురౌతున్నారు. ఈ లెక్కల పద్దులు మన తెలుగు సినిమా సత్తాని చాటి చెబుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లోనూ 'బాహుబలి' సాధించిన వసూళ్ల లెక్క దాదాపు 800 కోట్ల పై మాటే. ఇది 'బాహుబలి' సాధించిన విజయమే కాదు, తెలుగు సినిమా సాధించిన విజయం.