'బాహుబలి ది కన్‌క్లూజన్' సినిమా ఈ నెలాఖరులో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా చూడ్డానికి యావత్ ప్రపంచం ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తోంది. ఇప్పటికే ఈ సినిమా టికెట్స్‌కి అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోయాయని సమాచారమ్. అయితే ఈ సినిమా టికెట్స్ పొందడానికి ఓ కొత్త ఆఫర్ ఎట్రాక్ట్ చేస్తోంది. అదేంటంటే.. బాహుబలి ది కన్‌క్లూజన్‌కి టికెట్ ఫ్రీగా కావాలంటే 'బాహుబలి ది బిగినింగ్' సినిమా హిందీలో మళ్లీ ధియేటర్లో చూడడమే. అంతే చాలా సింపుల్ కదా. ఏప్రిల్ 7 నుండి 17 వరకూ ఈ సినిమాను ధియేటర్లో ప్రదర్శించనున్నారు. ఈ సినిమా హిందీ వెర్షన్‌ను ధర్మా ప్రొడక్షన్స్ సంస్థ రిలీజ్ చేస్తోంది. ఈ సంస్థ వారే ఈ అరుదైన ఆఫర్‌ని ప్రవేశపెట్టారు. మొదటి పార్ట్‌కి టికెట్ కొని ధియేటర్‌లో చూస్తే రెండో పార్ట్‌కి టికెట్ గ్యారంటీ అని హామీ ఇస్తున్నారు. అయితే ఇంకేముంది హిందీ వెర్షన్‌కి టికెట్ కొనేద్దామని హడావిడి పడుతున్నారా? ఆగండాగండి ఇక్కడే అసలు ట్విస్ట్ ఈ గోల్డెన్ ఆఫర్ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో వర్తించదట. అలాగైతే ఇంకెందుకు ఈ 'ఉచిత' ఆఫర్? అనే డౌట్ మీకు కలగడం సహజం. హిందీ వెర్షన్‌ని విడుదల చేస్తున్న ధర్మ ప్రొడక్షన్స్ ఈ ఆఫర్‌ని ప్రకటించింది కాబట్టి, ఈ షరతులు ఇలా ఉన్నాయ్. ఆ ఆఫర్ ఏదో మన సౌత్‌లోనూ ఉండి ఉంటే బాగుండేది.