ఎల్లుండే 'బాహుబలి ది కంక్లూజన్' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్‌ల ద్వారా చాలావరకు టిక్కెట్స్ బుక్ అయిపోయాయి. ఇంకా అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్ కౌంటర్స్ వద్ద క్యూలైన్లు చాంతాడంత కనిపిస్తుండగా, బ్లాక్‌లోనూ అప్పుడే 'బాహుబలి ది కన్‌క్లూజన్' టిక్కెట్ల అమ్మకాలు మొదలయ్యాయని సమాచారమ్. అయితే బ్లాక్‌లో టికెట్ రేటు ఎంతో తెలుసా.. అక్షరాల 3 వేల రూపాయలకు పైనేనట. అంతలా 'బాహుబలి' టిక్కెట్‌ని అమ్మేస్తున్నారట బ్లాక్‌లో. అయితే అలా బ్లాక్‌లో టిక్కెట్లు కొని మోసపోవద్దంటున్నారు పోలీసులు. అంతేకాదు ఆన్‌లైన్‌లో ఫేక్ వెబ్‌సైట్ల ద్వారా ఇప్పటికే 'బాహుబలి' అభిమానుల్ని కొందరు అక్రమార్కులు కొల్లగొట్టేశారు. ఈ ఫేక్ వెబ్‌సైట్లలో ఎప్పుడూ టిక్కెట్స్ ఖాళీగానే ఉంటున్నాయి. అభిమానులు ముందు వెనక ఆలోచించకుండా బుకింగ్స్ చేసేశారు. బండారం బయట పడ్డాక లబో దిబోమంటున్నారు. అందుకే 'బాహుబలి' టికెట్స్ బుకింగ్ విషయంలో తస్మాత్ జాగ్రత్త అంటున్నారు. అయితే 'బాహుబలి ది బిగినింగ్' మీద నెలకొన్న క్రేజ్ దృష్ట్యా సినిమా టిక్కెట్ కోసం ఎంతైనా వెచ్చించడానికి సినీ అభిమానులు వెనుకాడ్డంలేదు మరో పక్క. ఆంధ్రప్రదేశ్‌లో రోజుకి 6 ఆటలు, తెలంగాణలో రోజుకి ఐదు ఆటలు ప్రదర్శితం కానున్న 'బాహుబలి'కి అదనంగా ఇంకో రెండు మూడు షోలు ప్లాన్ చేసినా టిక్కెట్లు దొరికేలా కన్పించడంలేదు. 'బాహుబలి'కున్న క్రేజ్ అలాంటిది మరి.