బాహుబలి ఒక సినిమా అనేకన్నా ఒక అద్బుతం అంటే బాగుంటుందేమో. ఈ మాట కేవలం ఆ చిత్రం సాదించిన విజయాన్ని బట్టి కాకుండా ఆ సినిమా వల్ల తెలుగు చలనచిత్ర పరిశ్రమ గురించి ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకోవడం.
ఇక బాహుబలి మొదటి భాగం సృష్టించిన రికార్డ్ వసూళ్లు ఇంకా మరువకముందే ఆ చిత్ర రెండో భాగం రిలీజ్ కి ముందే వందల కోట్లు బిజినెస్ చేయడం ఈ చిత్రానికి జనాల్లో ఉన్న క్రేజ్ తెలియచేస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం బాహుబలి హిందీ వెర్షన్ శాటిలైట్ హక్కులు రూ 50కోట్లకు పైగా చెల్లించి ప్రముఖ టీవీ ఛానల్ సోనీ దక్కించుకుంది!
ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లోని ఏరియాల్లో బంపర్ బిజినెస్ చేసేసినట్టు సమాచారం. ముందుగానే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో ఈ సినిమాకి సంబంధించి అన్ని పనులు షెడ్యూల్ ప్రకారమే నడుస్తునట్టు సమాచారం.
రిలీజ్ కు ముందే రికార్డుల మోత మోగిస్తున్న బాహుబలి ఇక రిలీజ్ తరువాత ఎలాంటి సంచలనాలు రేపుతుందో చూడాలి.