'హైపర్' సినిమా తర్వాత రామ్ ఇంకో సినిమా ఏదీ కన్‌ఫామ్ చేయలేదు. కొత్త గెటప్ కోసం గడ్డం పెంచేశాడీ యంగ్ హీరో. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, తన ఫొటోల్ని షేర్ చేస్తూ అభిమానుల్ని ఉత్సాహపరుస్తున్నాడు. అయితే, కొత్త సినిమా ఎప్పుడు గురూ? అని అభిమానుల నుంచి వస్తున్న ప్రశ్నలు రామ్‌ని కూడా 'స్వీట్'గా ఇబ్బంది పెడుతున్నాయేమో. అందుకే కొంచెం ఓపిక పట్టమంటున్నాడు రామ్, తన అభిమానుల్ని ఉద్దేశించి. తన 15వ సినిమా కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అభిమానులకు థ్యాంక్స్ చెబుతూనే, మీ ప్రేమను పొందడం నా అదృష్టమని చెప్పాడు. యంగ్ హీరోల్లో రామ్ 'ఎనర్జిటిక్' అనే గుర్తింపు పొందాడు. వరుసగా సినిమాలు చేసే సత్తా ఉన్నా ఎందుకో 'హైపర్' తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్నాడు. లేట్ అయినా లేటెస్ట్‌గా వస్తానని అభిమానులకు భరోసా ఇస్తున్నప్పటికీ, అభిమానులు ఉత్కంఠని భరించడం కష్టమే కదా. ఆ స్వీట్ న్యూస్ ఏదో త్వరగా చెప్పేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. అభిమానుల్ని ఇలా వెయిట్ చేయించడం రామ్‌కీ ఇష్టం లేదు. కానీ ఏదో ఒక సినిమా చేసెయ్యడం కంటే అభిమానులు గర్వపడే సినిమా చేయాలన్నది ఆయన ఆలోచన. ఆ 15వ సినిమా అతి త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళే అవకాశం ఉందనే సంకేతాలు అయితే రామ్ పంపుతున్నాడు. ఆల్ ది బెస్ట్ టు రామ్.