సైబర్ నేరాల సంస్కృతి బాగా ఉదృతం అవుతున్న ఈ నేపధ్యంలో ఆ ప్రభావం బాహుబలి 2 సినిమా నిర్మాతలపైన కూడా పడింది.
అందుతున్న వివరాల ప్రకారం, బాహుబలి 2 నిర్మాతలకి గతనెల 27వ తేదిన ఓ ఆగంతుకుడు ఫోన్ చేసి, బాహుబలి 2 చిత్రాన్ని ఉపగ్రహం ద్వారా పైరసీ చేసామని, తమకు రూ 2కోట్లు ఇవ్వకపోతే, బాహుబలి చిత్రాన్ని అంతర్జాలంలో పెట్టేస్తామని బెదిరించారు.
అయితే చిత్ర నిర్మాత అయిన శోభు వెంటనే పోలీసులని ఆశ్రయించారు. ఆ తరువాత హైదరాబాద్ పోలీసులు వెంటనే అప్రమత్తమయి పైరసీకి పాల్పడ్డ వారిని అరెస్ట్ చేశారు.
అత్యంత నాటకీయంగా జరిగిన ఈ అరెస్టుల వివరాల తెలియాల్సిఉంది. ఇక అరెస్ట్ చేసినవారిని ఈ రోజు హైదరాబాద్ లో విలేఖరుల ముందు నిలబెట్టే ఆస్కారం ఉందని తెలుస్తుంది.