బాహుబలి మేనియాని క్యాష్ చేసుకోవడానికి దళారులు బ్లాకులో టికెట్స్ అమ్ముతుండడంతో సగటు సినీఅభిమాని నిర్వేదానికి గురవుతున్నారు.
ఇదిలాఉంటే, బాహుబలి నిర్మాతలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి వారు ఆనందించే ఒక శుభవార్త వెలువరించింది. అదేంటంటే, ఆంధ్రప్రదేశ్ లోని థియేటర్లలో బాహుబలి రిలీజ్ అయిన మొదటి వారం వరకు మల్టీప్లెక్స్ లలో రూ 150 టికెట్ రూ 200కి, రూ 200 టికెట్ రూ 250కి పెంచారు. ఇక సాధారణ ధియేటర్ లో టికెట్ ధర రూ 70 టికెట్ రూ 100కి, అలాగే రూ 90 టికెట్ రూ 150కి పెంచానున్నారట.
దీనితో బాహుబలి నిర్మాతలకి కాసుల పంటేనని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే రోజుకి 6 షోలకి అనుమతినిచ్చిన ప్రభుత్వం ఈ ఆఫర్ కూడా ఇవ్వడంతో బాహుబలి కలెక్షన్స్ ఆంధ్రప్రదేశ్ లో రికార్డు స్థాయిలో ఉంటాయనడంలో సందేహంలేదు.