బాహుబలి స్పెషల్ షోల వెనుక రాజకీయ హస్తం?!

By iQlikMovies - April 26, 2017 - 18:58 PM IST

మరిన్ని వార్తలు

కొద్దిసేపటి క్రితంవరకు బాహుబలి స్పెషల్ షోల పైన తీవ్ర ఉత్కంట నెలకొంది.

అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇప్పుడే వెలువడింది. దీనితో రేపు రాత్రి 9.30 గంటలకు హైదరాబాద్ లోని ప్రముఖ మల్టీప్లెక్స్ లో బాహుబలి 2 స్పెషల్ షోస్ పడనున్నాయి. ఇక విషయానికి వస్తే, ఈ పర్మిషన్లు రావడం వెనుక ఓ రాజకీయ నాయకుడి హస్తం పనిచేసినట్టుగా తెలుస్తుంది.

ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి సమీప బంధువు దీని వెనుక ఉన్నారని, అతని ఆధ్వర్యంలోనే రేపు రాత్రి స్పెషల్ షోస్ వేయడానికి అనుమతి వచ్చిందని తెలుస్తుంది.

అయితే ఈ స్పెషల్ షోస్ కి సంబంధించి టికెట్ ధరలు మాత్రం సగటు ప్రేక్షకుడికి చుక్కలు చూపిస్తున్నాయి. దాదాపుగా ఈ టిక్కెట్ ధర రూ 1500 నుండి రూ 2000వరకు ఉన్నట్టు సమాచారం.

చూద్దాం. ఈ స్పెషల్ షోస్ కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS