పైరసీ విషయంలో 'బాహుబలి' చిత్ర యూనిట్ పైరసీ దారులపై పలు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. కానీ పైరసీ దారులు అవన్నీ పక్కన పెట్టేసి, తమ పని తాము ధైర్యంగా చేసుకుని వెళ్లిపోతున్నారు. సినిమా విడుదలయ్యాక ఎవరి దారి వారిదే. ధియేటర్స్‌కి వెళ్లి సినిమా చూసే వాళ్లు చూస్తున్నారు. అక్కడి నుండి సినిమాని మొబైల్స్‌లో క్లిక్ మనిపించి, ఆ ఫోటోలు, వీడియోలు ఇమ్మీడియట్‌గా ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేసేస్తున్న వాళ్లు అంతకన్నా ఎక్కువ మందే ఉన్నారు. దీన్ని ఆపడం ఎవ్వరి వల్లా కాని పని అయిపోతోంది. సినిమా చూస్తున్నామని ధియేటర్లో కూర్చొని వీడియోలతో సహా పంపించేస్తున్నారు. ఇలాంటి వారిలో కేవలం సామాన్యులే కాకుండా సినీ సెలబ్రిటీస్ కూడా ఉండడం బాధాకరం. ఏది ఏమైనా బాహుబలి పైరసీ విషయంలో చిత్ర యూనిట్ మాత్రం గట్టిగా హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. సంబంధిత ప్రభుత్వ యంత్రాంగంతో చర్చలు కూడా జరుపుతోంది చిత్ర యూనిట్. అయినా కానీ పైరసీని ఆపటం సాధ్యం కాని విషయమే. మరి ఈ విషయంలో బాహుబలి టీమ్ ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకుంటుందో.. తెలీదు. అలాగే ప్రభుత్వం కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ, ఇలాంటి చర్యలకు పాల్పడ్డ వారికి కఠిన చర్యలు తప్పవని ఎప్పటికప్పుడే ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఎవరి స్వార్ధం వారిదే. వినేవారెంత మంది ఉన్నారు. ఆచరించే వారు ఎంత మంది ఉన్నారు చెప్పండి.