ఇండియా మొత్తం అలాగే భారతీయ సినిమా అభిమానులు అంతా బాహుబలి ఫీవర్ లో ఉన్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.
అలాంటి భారీ చిత్రాన్ని నిర్మించడానికి ఎంత డబ్బు వెచ్చించారో అని తెలుసుకోవాలని అందరికి ఉంటుంది. అయితే ఇప్పటివరకు బడ్జెట్ పై నిర్మాతలు ఎటువంటి ప్రకటన చేయలేదు.
కాని కొద్దిసేపటి క్రితం ముంబైలో జరిగిన హిందీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో అక్కడి విలేఖర్లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా బాహుబలి రెండు భాగాలకి కలిపి రూ 400-450 కోట్లు అయినట్టు నిర్మాత శోభు తెలిపారు.
దీనితో బాహుబలి బడ్జెట్ పై నెలకొన్న సస్పెన్స్ కి తెర పడినట్టయింది.