చిరంజీవికి క్రిష్ ఓ స్టోరీ లైన్ వినిపించాడని తాజా సమాచారమ్. ప్రస్తుతం చిరంజీవి 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' బయోపిక్‌లో నటించేందకు సిద్దంగా ఉన్నారు. ఈ సినిమా స్టోరీని ప్రిపేర్ చేసే పని పరుచూరి బ్రదర్స్‌కి అప్పగించారు. మరో పక్క ఇది చారిత్రాత్మక చిత్రం కాబట్టి, దీనికి సంబంధించిన పలు విషయాలపై క్షణ్ణంగా అధ్యయనం జరుగుతోంది. రేపో మాపో ఈ సినిమా పట్టాలెక్కేందుకు రెడీగా ఉంది. ఈ సినిమాకి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇదిలా ఉండగా, మరో పక్క క్రిష్‌తో సినిమాకి చిరంజీవి కమిట్ ఆయ్యారని తెలుస్తోంది. ఇది కూడా చాలా పవర్ ఫుల్ స్టోరీ అంటున్నారు. ఇటీవలే బాలయ్యతో 100వ చిత్రం తెరకెక్కించారు క్రిష్. 'గౌతమీ పుత్ర శాతకర్ణి' వంటి చారిత్రాత్మక నేపధ్యమున్న చిత్రాన్ని తెరకెక్కించి క్రిష్ మంచి విజయాన్ని దక్కించుకోవడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమాతో క్రిష్ ప్రముఖ డైరెక్టర్స్ లిస్టులోకి చేరిపోయారు. అదే ఉత్సాహంతో ఆయన మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసేందుకు ముందుకొచ్చారు. క్రిష్ వినిపించిన స్టోరీ లైన్ చిరంజీవికి బాగా నచ్చింది. దాన్ని డెవలప్ చేసి తీసుకురమ్మనీ, ఖచ్చితంగా ఆ సినిమా చేద్దాం అని క్రిష్‌కి చిరు భరోసా ఇచ్చినట్లు తెలియవస్తోంది. అయితే చిరంజీవి 151వ చిత్రం 'ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి' బయోపిక్ అవుతుందా? లేక క్రిష్ డెవలప్ చేసే స్టోరీ కానుందా అనే సస్పెన్స్ నెలకొంది.