శివరాత్రి సందర్భంగా విడుదలైన ప్రభాస్ బాహుబలి పోస్టర్ అందరిని షాక్ గురిచేసింది. ఒక్కసారిగా బాహుబలి పార్ట్ 2 పై అంచనాలను ఆకాశానికి ఎత్తేసింది.
అయితే అప్పుడే ఈ పోస్టర్ థాయిలాండ్ సినిమా ఆంగ్ బ్యాక్ పార్ట్ 2 పోస్టర్ ని పోలి ఉందని వస్తున్న వార్తలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. మీకు గుర్తుండి ఉంటే బాహుబలి పార్ట్ 1 పోస్టర్ విడుదల అయినప్పుడు కూడా అది హాలీవుడ్ ఫిలిం సైమన్ బిర్చ్ సినిమా పోస్టర్ ని పోలి ఉండడం ఆరోజుల్లో పెద్ద సంచలనమే అయింది.
అయితే రాజమౌళి కూడా తన ముందు సినిమాల్లో కొన్ని సీన్స్ వేరే సినిమాలనుండి ఇన్సపైర్ అయ్యి వాటిని తన కథకు అనుగుణంగా మార్చుకున్న సందర్భాలు లేకపోలేదు.
మరి ఈ కాపీ వార్తల పై బాహుబలి టీం కాని లేక రాజమౌళి కాని స్పందిస్తారో లేదో చూడాలి!