యూ ట్యూబ్‌లో బాహుబలి-2 ప్రభంజనం మొదలైంది. ట్రైలర్ విడుదలవుతూనే సంచలనాలకి తెరలేపింది. ఇంతకుముందెన్నడూ లేని విధంగా అతి తక్కువ సమయంలోనే కోటి వ్యూస్‌ని దాటేసింది 'బాహుబలి ది కంక్లూజన్'. ఈ రోజు ఉదయం ఎంపిక చేసిన థియేటర్లలో ట్రైలర్‌ని విడుదల చేశారు. కాస్సేపట్లోనే సోషల్ మీడియాకి ఎక్కింది ట్రైలర్. ఇందులో తెలుగు వెర్షన్ అతి తక్కువ సమయంలో కోటి వ్యూస్ దాటింది. సాధారణంగా ఓ సినిమాకి ట్రైలర్‌గానీ, టీజర్‌గానీ కోటి వ్యూస్ దాటాలంటే కొన్ని రోజులైనా పడుతుంది. అయితే 'బాహుబలి ది బిగినింగ్' కొద్ది గంటల్లోనే ఆ ఫీట్ సాధించి రికార్డులకెక్కింది. ఇది తెలుగు వెర్షన్ రికార్డ్ మాత్రమే. హిందీ వెర్షన్ కూడా ఓన్‌గా రికార్డులు కొల్లగొట్టేస్తోంది. ట్రైలరే ఇలా రికార్డులు బద్దలు కొట్టేస్తుండగా, ఇక సినిమా విడుదలైతే బాక్సాఫీస్ బద్దలయిపోవడం పక్కా అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇంతవరకూ యూ ట్యూబ్ వ్యూస్‌లో కోటిని క్రాస్ చేసింది 'కాటమరాయుడు' టీజర్. అయితే దాన్ని ఇప్పుడు 'బాహుబలి' కొట్టేశాడు. అది కూడా అతి తక్కువ టైంలో. ఇదే అసలు రికార్డు అంటే. అందుకే ఈ రికార్డు సంచనం అయ్యింది. సినిమా చూడ్డానికి వెళ్లినట్లుగా ప్రేక్షకులు ట్రైలర్‌ని వీక్షించడానికి ధియేటర్లకు పరుగులు పెడుతున్నారు. ప్రబాస్, తమన్నా, అనుష్క, రానా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరింకేం సినిమా చూడడానికి రెడీ అయిపోవడమే.