ఉదయం నుండి ఎక్కడ చూసిన బాహుబలి నామ స్మరణే కనిపిస్తుంది. బాహుబలి పార్ట్ 2 ట్రైలర్ రిలీజ్ పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాహుబలి అభిమానులు అంతా ట్రైలర్ కోసం ఆత్రుతగా ఎదురుచూశారు.
ఇక బాహుబలిలో కట్టప్ప రోల్ కి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అలాంటి పాత్ర ఆఫర్ వస్తే ఎవరు మాత్రం వదులుకుంటారు! కాని దురదృష్టవశాత్తూ తమిళ నటుడు శరత్ కుమార్ ఈ అవకాశాన్ని వదులుకున్నాడట.
తెలుస్తున్న వివరాల ప్రకారం, కట్టప్ప క్యారక్టర్ కోసం శరత్ కుమార్ ని సంప్రదించారట! అయితే తన నిర్ణయం త్వరగా చెప్పకపోయేసరికి సత్యరాజ్ ని ఎంపిక చేసుకున్నారట. అలాగే తమిళంలో హిట్ అయిన ఒక థ్రిల్లర్ సినిమా (16 పేరుతో తెలుగులో పోయినవారం రిలీజ్ అయింది) ఛాన్స్ కూడా ఇలానే తప్పిపోయిందట.
ఇలా తన చేతి వరకు వచ్చి జారిపోయిన పాత్రలు హిట్ అవ్వడంతో శరత్ కుమార్ దిగులు పడుతున్నాడట.