ఈ 'బాహుబలి'ని చెక్కేది జక్కన్న కాదు.!

By iQlikMovies - November 14, 2018 - 18:48 PM IST

మరిన్ని వార్తలు

'బాహుబలి' సినిమాతో ఏకంగా ప్రపంచమే తెలుగు సినిమా వైపు తల తిప్పి చూసింది. అంతటి ఖ్యాతిని తెలుగు సినిమాకి దక్కించిన గొప్ప డైరెక్టర్‌ రాజమౌళి. దేశ విదేశాల్లో ఈ సినిమా సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. అలాంటి బాహుబలికి ప్రీక్వెల్‌ తెరకెక్కించే యోచనలో నిర్మాతలున్నారన్న సంగతి గత కొంత కాలం నుండీ ప్రచారంలో ఉంది. 

అయితే ఈ బాహులి ధియేటర్స్‌లో ప్రదర్శించబడదు. ఇదో వెబ్‌ సిరీస్‌. నెట్‌ ఫ్లిక్స్‌లో మాత్రమే ప్రసారమవుతుంది. 'బాహుబలి' తల్లిగా నటించిన 'శివగామి' బాల్యం, ఆమె పెరుగిన వాతావరణం, చిన్నతనం నుండీ ఆమె చూపించిన ధీరత్వం తదితర అంశాల్ని ఈ వెబ్‌ సిరీస్‌లో చూపించనున్నారట. అయితే ఈ బాహుబలికి దర్శకత్వం వహించేది జక్కన్న రాజమౌళి కాదు. ప్రముఖ దర్శకులు దేవాకట్టా, ప్రవీణ్‌ సత్తారులతో పాటు, మరో బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు ఈ వెబ్‌సిరీస్‌ని రూపొందించనున్నారనీ తెలుస్తోంది. 

అంటే 'బాహుబలి' సీజన్‌ 'బిగినింగ్‌' అండ్‌ 'కన్‌క్లూజన్‌' లతో ముగిసిపోలేదన్న మాట. మళ్లీ మొదటి నుండీ మొదలు కానుంది. భలే ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా. ఇంతకీ శివగామి పాత్ర పోషించేదెవరంటే ఓ ఉత్తరాది నటి. ఆమె పేరు మృణాల్‌ ఠాకూర్‌. ఈ వెబ్‌ సిరీస్‌లో శ్రియ ఓ కీలక పాత్ర పోషించనుందనీ తాజా సమాచారమ్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS