సూపర్ స్టార్ మహేష్ బాబు ఈమధ్యనే ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్స్ అయిన ఏషియన్ సినిమాస్ తో కలిసి థియేటర్లని హైదరాబాద్ లోని ఒక మాల్ లో నిర్మించాడు. దీనికి AMB సినిమాస్ అని పేరు కూడా పెట్టేశాడు.ఇప్పుడు ఈ థియేటర్స్ ప్రారంభించడానికి సూపర్ స్టార్ రజినీకాంత్ రాబోతున్నట్టుగా సమాచారం.
ఇక 2.0 సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్ లో రజినీకాంత్ చేతుల మీదుగా AMB సినిమాస్ ఓపెనింగ్ జరగనుందట. అయితే దీనిపైన అధికారిక ప్రకటన వెలువడాల్సిఉంది. ఇదిలావుండగా మొన్న విడుదలైన 'థగ్స్ అఫ్ హిందూస్తాన్' సినిమా నుండే ఈ మల్టీప్లెక్స్ ప్రారంభించాలి అని భావించి, ఆ చిత్ర హీరో అమీర్ ఖాన్ ని కూడా ఆహ్వానించారట, అయితే చివరి నిమిషంలో ఆ కార్యక్రమం వాయిదాపడింది.
ఇప్పుడు మాత్రం సూపర్ స్టార్ రజనీ చేతుల మీదుగా మరో సూపర్ స్టార్ కి చెందిన మల్టీప్లెక్స్ ప్రారంభం కాబోతుండడం నిజంగా విశేషం అనే చెప్పాలి. ఇక మహేష్ కూడా సినిమాకి అనుబంధ రంగాల్లోనే పెట్టుబడి పెడుతుండడాన్ని కూడా అందరూ అభినందిస్తున్నారు.
సో.. ఆల్ ది బెస్ట్ మహేష్...