వెయ్యి కోట్లకు ఇంకెంత దూరం?

మరిన్ని వార్తలు

'బాహుబలి ది కన్‌క్లూజన్‌' రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. సినిమా విడుదలై వారం గడిచినా ఈ మేనియా ఇంకా వదలడం లేదు. వసూళ్ల రేస్‌లో అలసటే లేదు. ఇప్పటికే అన్ని భాషల్లో లుపుకుని 'బాహుబలి ది కన్‌క్లూజన్‌' 800 కోట్లు దాటేసింది. మన దేశంలోనే 600 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. పక్కా లెక్కలతో సహా ఈ సినిమా వసూళ్లని ప్రకటించేస్తున్నారు ట్రేడ్‌ పండితులు. అమెరికాలో అయితే 'బాహుబలి ది కన్‌క్లూజన్‌'కి తిరుగే లేకుండా ఉంది. రెండో వారం కూడా ఈ సినిమా జోరు ఇలాగే కొనసాగేలా ఉంది. ఈ వారం విడుదలైన సినిమాల్లో పెద్దగా చెప్పుకోదగ్గవి ఏమీ లేకపోవడం ఆడియన్స్‌ దృష్టి 'బాహుబలి' మీదే ఉండడం పక్కా అంటున్నాయి ఫిలిం వర్గాలు. ఇంతవరకూ ఈ స్థాయిలో వసూళ్లు సాధించిన ఇండియన్‌ చిత్రం ఇదే. ఆ వెయ్యి కోట్ల కోట్లు కూడా సాధించేస్తే, ఆ ఘనత సాధించిన తొలి భారతీయ చలనచిత్రంగా 'బాహుబలి' సరికొత్త రికార్డు సృష్టిస్తుంది. ఆ గ్రేట్‌ మూమెంట్‌ ఈ రోసే వస్తుందని ట్రేడ్‌ పండితులు అంచనా వేస్తుండగా, కాస్తలో తప్పినా రేపు ఖచ్చితంగా వెయ్యి కోట్ల మార్క్‌ని దాటేస్తుందనే గట్టి నమ్మకం అందరిలోనూ వ్యక్తమవుతోంది. ఓ తెలుగు దర్శకుడు, ఓ తెలుగు సినిమాని అత్యద్భుతంగా తెరకెక్కించడమే కాకుండా, బాలీవుడ్‌ ప్రశంసలు అందుకోవడం, అంచనాలకు మించి వసూళ్ళ రికార్డుల్ని సాధించడం ఓ చరిత్ర. ఆ చరిత్ర సృష్టించిన వ్యక్తిగా రాజమైళి పేరు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది.

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS