'బాహుబలి' సినిమా సందడి మొదలైపోయింది. సందడి అయితే స్టార్ట్ అయ్యింది కానీ, పైరసీ నుండి తప్పించడం ఎవ్వరి వల్లా కాలేకపోయింది. మొబైల్స్ తదితర స్మార్ట్ ఐటెమ్స్ ద్వారా చిన్న చిన్న వీడియోలను, ఫోటో స్టిల్స్‌ను కట్ చేసి పెట్టేస్తున్నారు. దాంతో సినిమా మొత్తం సీన్స్ వైజ్‌గా బయటికి వచ్చేసింది. ఈ పైరసీ విషయంలో చిత్ర యూనిట్ ఎంత జాగ్రత్త తీసుకున్నా దాన్ని నిరోధించడం వల్ల కాలేదు. ఏది ఏమైనా పైరసీ దెబ్బ ఒక పక్క ఉన్నా, కానీ ధియేటర్స్‌లో వీక్షించాలనే సగటు ప్రేక్షకుడి కోరిక మాత్రం అలాగే ఉంది. దాంతో ధియేటర్ల వద్ద సందడి వాతావరణం కూడా అదే రేంజ్‌లో ఉంది. ప్రతీ ఒక్క ఇండియన్ ప్రెస్టీజియస్‌గా తీసుకున్న సినిమా ఇది. కేవలం ప్రబాస్ సినిమానో, రాజమౌళి సినిమానో అన్నట్లుగా కాకుండా, ఒక తెలుగు సినిమా అనే భావన అందరిలోనూ నెలకొనడం విశేషం. అదే ఉద్దేశ్యంతో ఈ సినిమా సక్సెస్ అవ్వాలని అంతా కోరుకున్నారు. అలాగే ఈ సినిమాకి జనంలో క్రేజ్ పెరిగిపోయింది. ఇండియాలోనే కాదు యావత్ ప్రపంచం ఈ సినిమాకి సలాం అంటోంది. తెలుగు సినిమా ఖ్యాతిని ఎవరెస్టు శిఖరమంత ఎత్తుకు తీసుకెళ్లిన ఘనత ఈ 'బాహుబలి' సినిమాది. చూసిన ప్రతీ ఒక్కరూ సినిమా గురించి గొప్పగా చెప్పకుండా ఉండలేకపోతున్నారు. సామాన్య జనమే కాదు, సినీ పరిశ్రమలోని ప్రతీ ఒక్కరూ ఈ సినిమా గొప్పతనాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.