కట్టప్ప క్షమాపణ వర్కవుటయ్యింది

మరిన్ని వార్తలు

'బాహుబలి ది కన్‌క్లూజన్‌' సినిమా విడుదలకి కర్ణాటకలో అడ్డంకులు తొలిగాయి. ఆందోళనకారులు ఈ సినిమా విడుదల విషయంలో కొంత శాంతించారు. విడుదలకి సహకరిస్తామని ప్రకటించారు. అయితే తమిళ నటులు గానీ, ఇంకే ఇతర నటులైనా కానీ కర్ణాటక ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. తొమ్మిదేళ్ల క్రితం కావేరీ జలాల నేపథ్యంలో వివాదం నెలకొంది. ఆ విషయంలో నటుడు సత్యరాజ్‌ కర్ణాటక ప్రజలకు వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు నిరసనగా, సత్యరాజ్‌ ప్రధాన పాత్రలో నటించిన 'బాహుబలి ది కన్‌క్లూజన్‌' సినిమా విడుదలకు కర్ణాటక ప్రజలు నిరాకరించారు. దాంతో 'బాహుబలి' సినిమా డైరెక్టర్‌ రాజమౌళి ప్రేక్షకుల ముందుకొచ్చి సత్యరాజ్‌ తరపున కర్ణాటక ప్రజలను క్షమాపణలు కోరాడు. ఆ తర్వాత సత్యరాజ్‌ కూడా తన వ్యాఖ్యలు బాధించి ఉంటే క్షమించమని అన్నారు. అందుకు ప్రతిగా సినిమా విడుదలకు ఎటువంటి ఆటంకం కల్గించొద్దని ఆయన కర్ణాటక ప్రజలను కోరారు. దాంతో ఈ వివాదం సద్దుమణిగింది. ఆందోళన కారులు శాంతించి, సినిమా విడుదలకు ఒప్పుకున్నారు. ఏప్రిల్‌ 28న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సుమారుగా 6000 వేల ధియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది. ప్రబాస్‌, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS