గ్లామ్‌షాట్‌: ఉల్లిపొర మాటున 'కాంచన'మాల.!

By iQlikMovies - February 14, 2019 - 10:50 AM IST

మరిన్ని వార్తలు

తెలుగులో అప్పుడెప్పుడో నారా రోహిత్‌ హీరోగా నటించిన 'బాణం' సినిమాలో క్యూట్‌గా కనిపించిన ముద్దుగుమ్మ వేదిక గుర్తుంది కదా. ఆ తర్వాత సుమంత్‌తో ఓ సినిమాలో నటించింది. జూనియర్‌ నగ్మా అని ఆ టైంలో ఈ ముద్దుగుమ్మను అభిమానులు ముద్దుగా పిలుచుకున్నారు.

 

కానీ ఆ స్థాయి సక్సెస్‌ మాత్రం అందుకోలేకపోయింది. తర్వాత లారెన్స్‌తో 'ముని' సినిమాలో తళుక్కున మెరిసింది. తాజాగా లారెన్స్‌తోనే మళ్లీ 'ముని 4'లో నటిస్తోంది. ఈ సినిమాని తెలుగులో కాంచన సిరీస్‌లో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, తాజాగా ఈ హాట్‌ బ్యూటీ ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డుల కోసం ఓ డిఫరెంట్‌ కాస్ట్యూమ్‌లో దర్శనమిచ్చింది. కెమెరాకి తనదైన హాట్‌ స్టిల్స్‌లో పోజిచ్చేసింది. చెమ్కీ చెమ్కీ కాస్ట్యూమ్‌ తీక్షణంగా చూస్తే, అసలు ఒంటి మీద డ్రస్సు ఉందా.. అనిపించేలా ఉంది ఆ కాస్ట్యూమ్‌.

 

భుజాలపై బ్లేక్‌ అండ్‌ మెరూన్‌ కాంబినేషన్‌లో వెల్వెట్‌ డిజైన్‌ కాస్ట్యూమ్‌ అందంతో పాటు, వేదిక గ్లామర్‌ని మరింత హైలైట్‌ చేస్తోంది. ఈ హాట్‌ అండ్‌ స్పైసీ లుక్‌లో వేదిక పిక్‌ ఇప్పుడు నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేస్తోంది. మీరు కూడా ఇటు ఓ లుక్కేస్కోండి మరి. 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS