'నీకు ఒక సంవత్సరం టైం ఇస్తున్నాను. ఈ లోగా సచిన్‌వే అవుతావో, సోంబేరివే అవుతావో నీ ఇష్టం..' అంటూ రావు రమేష్ చెప్పే డైలాగ్‌తో 'మజిలీ' టీజర్ స్టార్ట్ అయ్యింది. చైతూ, సమంత పెళ్లి తర్వాత కలిసి నటిస్తున్న తొలి చిత్రమిది. ఇక టీజర్ విషయానికి వస్తే, టీజర్లో నాగచైతన్య క్రికెట్ ప్లేయర్‌గా కనిపిస్తున్నాడు ఓ యాంగిల్లో.
మరో యాంగిల్లో డ్రింకింగ్, స్మోకింగ్ ఇతరత్రా బ్యాడ్ హేబిట్స్ ఉన్న కుర్రాడిలా కనిపిస్తున్నాడు. చిన్నప్పటి నుండీ ఓ అమ్మాయిని లవ్ చేస్తాడు. కొన్ని కారణాల వల్ల ఆ అమ్మాయితో విడిపోతాడు హీరో. తర్వాత సమంతతో పెళ్లి జరుగుతుంది. పెళ్లి తర్వాత ఆ అమ్మాయిని మర్చిపోలేక భార్యను దూరం పెడతాడు. ప్రేమించిన అమ్మాయిగా దివ్యాంశ కౌశిక్ నటించింది. దివ్యాంశతో లిప్ టు లిప్ కిస్ కూడా లాగించేశాడు చైతూ. సమంత, చైతూ మధ్య వివాహ బంధం అయితే ఉంది కానీ, రొమాంటిక్ యాంగిల్‌ని టీజర్లో చూపించలేదు. 'నువ్వు నా రూంలోకి అయితే వచ్చావు కానీ, నా జీవితంలోకి రాలేవు..' అంటూ సమంతనుద్దేశించి చైతూ కోపంగా డైలాగ్ చెబుతాడు. టీజర్ చివరలో 'ఎదవలకు మంచి భార్యలే దొరుకుతారు అని నువ్వే నిరూపించావ్..' అని పోసాని డైలాగ్ హైలైట్‌గా నిలిచింది.
టోటల్‌గా ఈ సినిమాలో సమంత బాధ్యత గల గృహిణి పాత్రలో నటించగా, చైతూ ఎలాంటి బాధ్యతా లేని సోంబేరీ కుర్రాడిలా కనిపించనున్నాడన్న మాట అని టీజర్‌ని బట్టి తెలుస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఏప్రిల్ 5న 'మజిలీ' ప్రేక్షకుల ముందుకు రానుంది.