బిగ్‌బాస్‌: బాబా భాస్కర్‌కి అన్యాయం జరిగింది!

మరిన్ని వార్తలు

మడ్‌ పిట్‌లో పువ్వులు పెట్టాలన్న టాస్క్‌లో హోరా హోరీగా పోటీ పడ్డారు అలీ రెజా, బాబా భాస్కర్‌. బాబా భాస్కర్‌ తన శక్తికి మించి ఆలీ రెజాతో పోరాడాడు ఈ టాస్క్‌లో. అలీ తన ఫిట్‌ బాడీతో, రియల్‌ డిచ్‌ ఫైటింగ్స్‌కి తెగ బడ్డాడు. అక్కడికీ మధ్యలో ఒకసారి బిగ్‌బాస్‌ అలీ రెజాని హెచ్చరించాడు కూడా. అయినా, ఏమాత్రం తగ్గకుండా, తన ధోరణిని విడిచి పెట్టలేదు. వాస్తవానికి మొదట్లో అలీ రెజా టాస్క్‌ల్లో పార్టిసిపేట్‌ చేసే తీరు ఇలాగే ఉండేది. కానీ, రీ ఎంట్రీలో కాస్త స్లో అయ్యాడు.

 

ముందు అలీ కావాల.. ముందు అలీ కావాలి.. అన్నందుకు తనలోని మొదటి అలీని బయటికి తీసుకొచ్చినట్లున్నాడు ఫినాలే టికెట్‌ కోసం అలీ రెజా. కానీ, ధగాపడ్డాడు. మట్టి కొట్టుకుపోవడం అంటే ఇదేనేమో.. అన్నట్లుగా మారింది అలీ పరిస్థితి. మడ్‌ పిట్‌లో అసలు బాబా భాస్కర్‌కి ఎంట్రీనే ఇవ్వకుండా అడ్డుకున్నాడు. అడ్డుకుంటే సరే, ఫిజికల్‌గా పోట్లాడాడు. పాపం.. బాబా భాస్కర్‌ అలీని నిలువరించడానికి చాలా చాలా ప్రయత్నించాడు. ఆ ప్లేస్‌లో బాబా భాస్కర్‌ కాబట్టి, అలీని తట్టుకోగలిగాడు. కానీ, మరే ఇతర కంటెస్టెంట్‌ అయినా, అలీ చేసిన ఫిజికల్‌ ఎటాక్‌కి ఈ తాజా ఎపిసోడ్‌లో రక్తపాతమే చవి చూడాల్సి వచ్చేది. ఆ రేంజ్‌లో అలీ రెజా తన పనితనం చూపించాడు. బ్యాలెన్సింగ్‌లో ది బెస్ట్‌గా పేరున్న బాబా భాస్కర్‌ అలీని ఎదుర్కోవడంలో తన డాన్సింగ్‌ టాలెంట్‌ని పూర్తి పనంగా పెట్టాడు.

 

అంత చేసినా హింస హద్దులు దాటేస్తోందన్న నెపంతో బిగ్‌బాస్‌ ఈ టాస్క్‌ని అర్ధాంతరంగా రద్దు చేసేశాడు. అంతేకాదు, అలీ రెజాని టాస్క్‌ నుండి ఎడిట్‌ చేశాడు. చేసిన దానికి అలీకి శిక్ష పడింది. కానీ, కష్టపడినందుకు బాబా భాస్కర్‌కి ఫలితం దక్కలేదు. బాబాని విన్నర్‌గా ప్రకటించినా బావుండేది. లేదంటే, ఫినాలే టికెట్‌ బాబాకి ఇచ్చేసినా బావుండేది.. అంటూ నెటిజన్స్‌ అభిప్రాయ పడుతున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS