బాబు గోగినేని-గణేష్.. ఈ ఇద్దరిది బిగ్ బాస్ హౌస్ లో ప్రత్యేకమైన బంధం అని చెప్పొచ్చు. ఒక సామాన్యుడిగా హౌస్ లోకి వచ్చిన గణేష్ కి బాబు గోగినేని అనేక మార్లు ధైర్యం చెప్పడం చాలా సందర్భాలలో తోడుగా నిలవడం చూసాము.
ఇక వీరి బంధానికి ప్రతీకగా ఒక టాస్క్ సమయంలో గణేష్ ని ఎలిమినేషన్ నుండి కాపాడడానికి తనకి అస్సలు ఇష్టం లేని కొత్తిమీరని తిన్నాడు. తాజాగా బిగ్ బాస్ బ్లాక్ బస్టర్ సినిమా టాస్క్ సందర్భంగా వీరిరువురు పండిస్తున్న హాస్యం షో చూస్తున్న వారందరినీ కడుప్పుబ్బా నవ్వేల చేస్తున్నది.
ముఖ్యంగా అందులో గణేష్ ని బాబు గోగినేని- “ ఒరేయ్ పెసరట్టు.. ఈ సీన్ ని నువ్వు ఉప్మా చేస్తున్నావ్” అనే డైలాగ్ ఇప్పుడు వైరల్ అయింది. నిన్నటి టాస్క్ లో వీరు చేసిన కామెడీ మొత్తం ఎపిసోడ్ కే హైలైట్ అని చెప్పొచ్చు.
ఇక ఈరోజు కూడా ఈ టాస్క్ కొనసాగనుంది కాబట్టి, వీరి కామెడీ ఈరోజు ఎలా పండనుందో చూద్దాం..