విద్యా బాలన్ కి సాంప్రదాయ స్వాగతం పలికిన బాలయ్య..!

By iQlikMovies - July 18, 2018 - 14:47 PM IST

మరిన్ని వార్తలు

ఎన్టీఆర్ బయోపిక్ లో బసవతారకం పాత్రలో నటించేందుకు హైదరాబాద్ వచ్చిన విద్యా బాలన్ కి నందమూరి బాలకృష్ణ కుటుంబసభ్యులు సాంప్రదాయం బద్దంగా ఆహ్వానం పలికారు.

ఆ వివరాలు ఇలా ఉన్నాయి- ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని బాలకృష్ణ ఇంటికి విద్యా బాలన్ రాగా ఆమెకి వారి ఇంటి  సాంప్రదాయం ప్రకారం చీరని బాలకృష్ణ సోదరి, భార్య, కూతురి చేతుల మీదుగా అందచేయటం జరిగింది. ఈ గౌరవానికి ఆమె చాలా ఆనందపడినట్టు సమాచారం.

ఇక విద్యా రేపటినుండి ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనబోతున్నట్టుగా యూనిట్ వర్గాలు తెలిపాయి. క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా బాలకృష్ణ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.

విద్యా బాలన్ రాకతో ఈ చిత్రానికి బాలీవుడ్ రంగు కూడా అద్దినట్టయింది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS