ప్రముఖ హేతువాది అయిన బాబు గోగినేని బిగ్ బాస్ లో పాల్గొంటుండడమే ఒక షాక్ అయితే ఆయన ఆ హౌస్ లో అందరితో కలిసిపోయి అందరికి వాళ్ళకి తెలియని విషయాలు చెబుతూ ఆ ఇంటి పెద్దలా మారిపోయాడు.
ఇక నాలుగైదు రోజుల క్రితం బాబు గోగినేని పైన దేశ ద్రోహం కేసుతో పాటు మరో 12 సెక్షన్ల క్రింద కేసు పొలిసు నమోదు చేయడం జరిగింది. అయితే ఆయనని ఈ కేసు కోసం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారు అన్న పుకార్ల నేపధ్యంలో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది.
అదేంటంటే బిగ్ బాస్ ఇంటిలో ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు అన్న కారణంగా ఆయనని బిగ్ బాస్ ఇంటిలోని జైలులో పెట్టడం జరిగింది. బిగ్ బాస్ ఇంటిలో అందరూ తెలుగులోనే మాట్లాడాలి అన్న నిబంధన కారణంగా ఆయనకి ఈ శిక్ష వేసారు.
ఆయన పైన మోపబడిన అభియోగాల కారణంగా ఆయన జైలుకి వెళతారు అని ఊహించిన వారికి ఆయన బిగ్ బాస్ షోలో జైలుకి వెళ్ళడం ఒక ఝలక్ లా తగిలింది.