వైఎస్సార్‌ బయోపిక్‌లో 'రంగమ్మత్త'.?

మరిన్ని వార్తలు

దివంగత నేత వై ఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవిత గాధ ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా హైద్రాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ మలయాళ నటుడు ముమ్ముట్టి వైఎస్సార్‌ పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు 'యాత్ర' అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు. కాగా ఈ సినిమాకి సంబంధించి ఫ్రెష్‌ అప్‌డేట్‌ ఒకటి ఫిల్మ్‌ నగర్‌లో చక్కర్లు కొడుతోంది. 

ఈ బయోపిక్‌లో బుల్లితెర హాటెస్ట్‌ యాంకర్‌, నటి అనసూయ ఓ ఇంపార్టెంట్‌ రోల్‌ పోషిస్తోందట. రాజశేఖర్‌రెడ్డికి అత్యంత సన్నిహితురాలైన మహిళా నేత పాత్రట అది. ఇటీవల 'రంగస్థలం' సినిమాలో 'రంగమ్మత్త'గా అనసూయ ఎలా ఆకట్టుకుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. విమర్శకులతో పాటు, పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు కూడా అందుకుంది అనసూయ ఆ పాత్రతో. క్లైమాక్స్‌లో ఊరి సర్పంచ్‌గా బాధ్యత స్వీకరించడం ఆ పాత్రలో ఆమె డిగ్నిటీ అందర్నీ ఆకట్టుకున్నాయి. 

అందుకే 'యాత్ర' సినిమాలో ఆ రాజకీయ నాయకురాలి పాత్ర కోసం అనసూయ అయితే బావుంటుందనీ చిత్ర యూనిట్‌ ఆమెను సంప్రదించిందట. ఆ పాత్రలో నటించేందుకు అనసూయ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందనీ తెలుస్తోంది. చూడాలి ఒకవేళ ఇదే నిజమైతే మరో డిగ్నిఫైడ్‌ రోల్‌లో అనసూయ తన టాలెంట్‌ ప్రూవ్‌ చేసుకోనుందన్న మాటే. 

మరోవైపు మెగా ప్రిన్స్‌, విక్టరీ వెంకటేష్‌ కాంబోలో తెరకెక్కుతోన్న మల్టీ స్టారర్‌లోనూ అనసూయ కీలక పాత్ర పోషిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS