బాబు గోగినేని-తనీష్ లలో ఒకరు వెళ్ళిపోనున్నారా?

మరిన్ని వార్తలు

అప్పుడే ఈ వారంలో శనివారం వచ్చేసింది అందులోను బిగ్ బాస్ సీజన్ 2 వీకెండ్ ఎపిసోడ్స్ ప్రసారమయ్యే సమయం కూడా దగ్గరపడింది.
ఇక ఈ వీకెండ్ ఎపిసోడ్స్ లో ప్రతిసారి ఆసక్తి రేపే ఎలిమినేషన్ ప్రక్రియ మరోసారి ఈ షో చూసే వీక్షకుల్లో టెన్షన్ పెంచనుంది. ఇంతకి ఈ వారం ఎలిమినేషన్ లో ఉన్నది బాబు గోగినేని, తనీష్, గణేష్, శ్యామల, గీతా మాధురి & దీప్తి నల్లమోతు.

ఇక ఈవారం బిగ్ బాస్ ఇంటి నుండి వెళ్ళిపోయే వారిలో బాబు గోగినేని & తనీష్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. దీనికి ముఖ్య కారణంగా- బాబు గోగినేని ఇంటిలోని సభ్యులతో పోల్చితే అంతగా హుషారుగా లేకపోవడం, టాస్క్ లలో అంతగా పాల్గొనకపోతుండడంతో ఆయన పైన వీక్షకులు ఒకింతగా అసహనం వ్యక్తం చేస్తున్నారు.

అదే సమయంలో మరో పార్టిసిపెంట్ తనీష్ బలహీనత అయిన కోపం వల్ల అతనకి షో చూస్తున్న వీక్షకుల వద్ద మైనస్ మార్కులు పడుతున్నాయి. ఈ తరుణంలోఈ ఇరువురిలో ఒకరు ఈ వారం ఇంటినుండి బయటకి వెళతారు అన్న టాక్ వినపడుతుంది.

అయితే వీరిద్దరిలో ఒకరా లేక మరోకరా అన్నది రేపు తెలియనుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS