బిగ్ బాస్ హౌస్ లో నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ కోసం పోటీపడిన దీప్తి & తనీష్ లలో చివరికి గెలుపు తనీష్ నే వరించింది. అయితే ఈ పెయింటింగ్ టాస్క్ లో పెయింట్ వెయ్యడం కన్నా పక్కన వారు పెయింట్ వేయకుండా ఆపడమే ధ్యేయంగా ఈ టాస్క్ కొనసాగింది.
ఇప్పటికే ఎలిమినేషన్ లో ఉన్న వీరిరువురు మధ్య పోటీ నెలకొనడంతో ఇంటి సభ్యులందరూ ఆసక్తిగా చూశారు, ఇక సంచాలకురాలిగా వ్యవహరించిన దీప్తి సునైనా నిర్ణయంతో కౌశల్ అంతగా సంతృప్తిచెందలేదు. అయినప్పటికీ సంచాలకురాలి నిర్ణయమే తుదినిర్ణయం కావడంతో తనీష్ రెండవసారి ఇంటి కెప్టెన్ గా అయ్యాడు.
ఇక తన శక్తినంతా ధారపోసి మరి టాస్క్ ఆడిన దీప్తి టాస్క్ పూర్తయిన వెంటనే ఏడ్చేసింది. ఒక అబ్బాయికి, అమ్మాయికి మధ్య శారీరక బలం పైన ఆధారపడిన టాస్క్ పెట్టడం ఎంతవరకు సమంజసం అంటూ సాటి ఇంటి సభ్యుల ముందు వాపోయింది.
ఏదేమైనా ఈ వారం ఎలిమినేషన్ లో ఉన్న దీప్తి ఆ గండం నుండి గట్టెక్కి బిగ్ బాస్ లో కొనసాగుతుందో లేదో అన్నది రేపటితో తేలిపోతుంది.