ఒక సినిమా హిట్ అయితే చాలు దాని చుట్టూ బోలెడు వివాదాలు చుట్టుముడుతున్నాయి. మొన్నటికి మొన్న కొరటాల శివ డైరక్షన్ లో మహేష్ నటించిన శ్రీమంతుడు మూవీ పలు వివాదాల్లో చిక్కుకుంది. ఆ కథ తనదే అని ఒకతను కేస్ ఫైల్ చేసి గెలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బేబీ మూవీ వివాదంలో చిక్కుకుంది. గత ఏడాది చిన్న సినిమాగా వచ్చిన బేబీ మూవీ ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ కలిసి నటించిన ఈ సినిమా భారీ లాభాలు తెచ్చి పెట్టింది. ఈ ఒక్క మూవీతో సాయి రాజేష్ పేరు మారు మోగిపోయింది. వైష్ణవి ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది. ఆనంద్ దేవరకొండకు కెరియర్ కి బిగ్గెస్ట్ హిట్ ని అందించింది.
బేబీ మూవీ ఘన విజయం సాధించటంతో, బాలీవుడ్ లో కూడా రీమేక్ చేయాలనీ ప్లాన్ చేసుకున్నారు. హిందీలో కూడా సాయి రాజేష్ డైరక్ట్ చేస్తారని మేకర్స్ రీసెంట్ గా పేర్కొన్నారు. ఇలాంటి నేపథ్యంలో బేబీ వివాదంలో చిక్కుకుంది. బేబీ కథ తనది అని సాయి రాజేష్ తనని మోసం చేసినట్లు, సినిమాటోగ్రాఫర్ శిరిన్ శ్రీరామ్ అనే అతను రాయ దుర్గం పోలీసులకి కంప్లైన్ట్ చేశారని సమాచారం. తన కథని అనుమతి లేకుండా సినిమా తీశారని చిత్ర నిర్మాత SKN, దర్శకుడు సాయి రాజేష్ పై ఫిర్యాదు చేశారు. శిరిన్ శ్రీరామ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
2013లో తన సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయాలని శ్రీరామ్‌ను సాయిరాజేశ్ కోరారట. 2015లో శ్రీరామ్ 'కన్నా ప్లీజ్' టైటిల్‌తో ఒక కథ రాసుకున్నా, తరవాత దీనికి ప్రేమించొద్దు అని టైటిల్ పెట్టారట. సాయి రాజేశ్ సూచనతో నిర్మాత శ్రీనివాస కుమార్ కు శ్రీరామ్ ఈ కథను వినిపించారట. ఆ కథే 2023లో సాయిరాజేశ్ దర్శకత్వంలో శ్రీనివాసకుమార్, ధీరజ్ మొగిలినేనిలు ఇద్దరు బేబీ సినిమా నిర్మించారని అతని ఆరోపణ. ఈ వివాదం పై బేబీ టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.