ప్రజంట్ థియేటర్స్ తో సమానంగా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కి కూడా ఆదరణ దక్కుతోంది. ప్రతి శుక్రవారం థియేటర్స్ లో రిలీజ్ అయ్యే సినిమాల కోసమే కాదు, OTT లో వచ్చే సిరీస్ లు, సినిమాల కోసం కూడా సినీలవర్స్ ఎదురు చూస్తున్నారు. కరోనా తరవాత ఓటీటీలో అన్ని సిరీసులు, మూవీస్, ప్రాంతీయ భాషల్లో కూడా అందుబాటులో ఉంటున్నాయి. ఒక భాషలో తీసి, మిగతా భాషల్లోకి డబ్ చేసి, ఒక వైపు సినీప్రియుల్ని అలరిస్తూ, మరో వైపు ఆర్థికంగా కూడా లాభ పడుతున్నారు. OTT ప్లాట్ ఫామ్ మూలంగా భాషా బేధాలు తొలగి యాక్టర్స్ కి నలుమూలలా ఫాన్స్ , ఫాలోవర్స్ పెరుగుతున్నారు. ఓటీటీ కంటెంట్ కు చాలా డిమాండ్ ఉంది. మేకర్స్ కూడా అందుకు తగ్గట్లే ఖర్చుకు వెనకాడకుండా మంచి మంచి కంటెంట్ తో సినిమాలు, వెబ్ సిరీస్ లు, డాక్యుమెంటరీలు ప్లాన్ చేస్తున్నారు.
యంగ్ స్టార్స్ తో పాటు సీనియర్ స్టార్స్ కూడా వెబ్ సిరీస్ లు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే పలువురు స్టార్స్ OTT లోకి ఎంట్రీ ఇచ్చి విశేష ఆదరణ పొందారు. విక్టరీ వెంకటేష్, రానా కలిసి 'రానానాయుడు' వెబ్ సిరీస్ తో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. వెంకీ నటనలో మరో కోణం బయట పడింది ఈ సిరీస్ తోనే, ఈ సిరీస్ తో ఉత్తరాదిన కూడా వెంకీకి ఫాన్స్ అయ్యారు. దూతతో నాగ చైతన్య 1ST ఓటీటీ హిట్ కొట్టారు . ఇంకా శ్రీకాంత్, జేడీ చక్రవర్తి, జగపతి బాబు లాంటి వారు ఇప్పటికే ఓటీటీ వేదిక పై మెరిసి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా ఓటీటీ ఎంట్రీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి డిజిటల్ ఎంట్రీకి సంబంధించిన న్యూస్ ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతుంది. చిరు ఓ వెబ్ సిరీస్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఎప్పటినుంచో ఓటీటీ ఎంట్రీ కోసం చూస్తున్న చిరు. ఇప్పుడు తన ఇమేజ్ కి సరిపడా కంటెంట్ దొరికటంతో ఈ వెబ్ సిరీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. దీనికి సంబందించిన ఇన్ఫర్మేషన్ ఏది బయటికి రాలేదు. ఎలాంటి సిరీస్, ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ అన్నది తెలియాల్సి ఉంది.