ప్రముఖ నటి మెహ్రీన్ కి ఈ మధ్యకాలంలో తరచుగా చేదు అనుభవాలని చవిచూస్తున్నది. మొన్నీమధ్యనే అమెరికా ఎయిర్ పోర్ట్ లో చికాగో సెక్స్ రాకెట్ కి సంబంధించి అక్కడి అధికారులు ఆమెని విచారించగా ఆమె ఎంతగానో బయపడిపోయింది.
దీనిని నుండి పూర్తిగా తేరుకోకకముందే తాజాగా ఆమె ఒక సినిమా షూటింగ్ కోసం ట్రైన్ లో ప్రయాణిస్తుండగా ఎదురైనా ఒక అనుభవం ఆమెని షాక్ కి గురిచేసింది. అదేమనగా- అనుకోకుండా ప్లాన్ చేసిన షూటింగ్ కారణంగా ఆమె చెన్నై వెళ్ళాల్సి వచ్చింది.
అయితే అనుకోకుండా చేఇస్న్ది కాబట్టి సమయానికి విమానం టిక్కెట్ దొరకపోతే వెంటనే సదరు ప్రొడక్షన్ వారు ఆమెకి ట్రైన్ లో ఏసీ రిజర్వేషన్ చేశారు. ఇక ఆమె ట్రైన్ లో వెళ్ళేందుకు బోగీలో కి ఎక్కగానే తనకి కేటాయించిన బెర్తులో ఎవరో వ్యక్తి మధ్యతాగి పడుకుని ఉండటం ఆమెని ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇక సదరు వ్యక్తిని లేపెందుకు సాహసించకుండా విషయాన్నీ నిర్మాతకి చెప్పగానే ఆయన ఒక కారుని ఆమె కోసం వెంటనే కారు ఏర్పాటు చేయగా ఆమె తరువాత స్టేషన్ లో దిగిపోయి కారులో చెన్నైకి వెళ్ళిపోయింది.
ఏదేమైనా.. ఈ అమ్మడికి ఈ రెండు సంఘటనలు వెంటవెంటనే షాక్ ఇచ్చాయి అని చెప్పొచ్చు.