అడల్ట్‌ కామెడీ: ఇదో టైపు హాస్యం.!

By iQlikMovies - September 11, 2018 - 16:08 PM IST

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌లో కామెడీ సినిమాలకు భలే డిమాండ్‌ ఉంది. కామెడీ రోల్స్‌లో రకరకాల కాన్సెప్ట్‌లు పుట్టుకొస్తుంటాయి అక్కడ. అడల్ట్‌ కామెడీ నేపథ్యంలో చాలా సినిమాలు బాలీవుడ్‌లో రావడం, ఘన విజయం సాధించడం తెలిసిన సంగతే. ఆ కోవలోకే మరో ఇంట్రెస్టింగ్‌ కామెడీ మూవీ రాబోతోంది. అదే 'బదాయి హో'. అమిత్‌ శర్మ ఈ చిత్రాన్ని రూపొందించాడు. 

'దంగల్‌' ఫేం సానియా మల్హోత్రా హీరోయిన్‌గా నటిస్తోంది. ఆయిష్మాన్‌ ఖురానా హీరోగా నటిస్తున్నాడు. మనవళ్లతో ఆడుకోవాల్సిన వయసులో హీరో తల్లి గర్భం దాల్చుతుంది. ఈ పాత్రలో నీనా గుప్తా నటిస్తోంది. కాన్సెప్ట్‌ కొత్తగుంది కదా. ఇప్పుడంటే కొత్త కానీ, ఒకప్పుడు చాలా మందికి అనుభవంలో ఉన్న విషయమే ఇది. దాంట్లోంచి ఫన్‌ జనరేట్‌ చేసేలా ఈ చిత్రాన్ని రూపొందించారు. అక్టోబర్‌ 19న 'బదాయి హో' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

తాజాగా విడుదలైన ట్రైలర్‌ ఇప్పుడు హల్‌చల్‌ చేసేస్తోంది. సానియా, ఆయిష్మాన్‌ మధ్య హాట్‌ హాట్‌ సీన్స్‌ కిర్రాకు పుట్టిస్తున్నాయి. కొంచెం హాటుగా, కొంచెం ఫన్నీగా అంతకు మించిన ఎమోషన్స్‌తో రూపొందిన 'బదాయి హో' హిట్‌ కొట్టేలానే కనిపిస్తోంది. ఇందులో వల్గారిటీ ఏమీ ఉండదనీ, ఓ ఇంట్రెస్టింగ్‌ టాపిక్‌ చుట్టూ హాస్యాన్ని అద్ది సినిమా తెరకెక్కించామని దర్శక, నిర్మాతలు చెబుతున్నారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS