'క్వీన్' సినిమాతో తిరుగులేని విజయం అందుకుని బాలీవుడ్ క్వీన్‌గా పేరొందుతున్న ముద్దుగుమ్మ కంగనారనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'మణికర్ణిక'. వీరనారి ఝాన్సీలక్ష్మీభాయ్ జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించేందుకు శ్రీకారం చుట్టారు.
అయితే చిత్రీకరణ దాదాపు చివరి దశకు చేరుకున్నాక, క్రిష్ తెలుగులో 'ఎన్టీఆర్' చిత్రంతో బిజీగా ఉన్న కారణంగా 'మణికర్ణిక'ను కాస్త పక్కన పెట్టారు. ఈలోగా కంగనా సినిమాలో వేలు పెట్టి కెలికేస్తోందనీ, సినిమాను తనకి తగ్గట్లుగా డైరెక్ట్ చేస్తోందనీ, ఇతర పాత్ర ధారుల్నీ, టెక్నీషియన్స్‌ని ఇబ్బంది పెడుతోందనీ ఈ మధ్య వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. అంతేనా, కంగనా బాధ పడలేక క్రిష్ ఈ సినిమా డైరెక్షన్ నుండి తప్పుకున్నారనే వార్త హైలైట్ అయ్యింది. అలాగే ఈ సినిమాలో మరో కీలక పాత్రధారి అయిన సోనూసూద్ అయితే అఫీషియల్‌గా సినిమా నుండి తప్పుకున్న సంగతి తెలిసిందే.
డైరెక్టర్ లేడు. ఇంపార్టెంట్ రోల్ పోషించే సోనూ సూద్ లేడు. ఇక నిర్మాతలు కూడా పక్కకు తప్పుకున్నారనే తాజా వార్త ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దీనికంతటికీ కారణం కంగనారనౌత్ ఓవరాక్షనే అని బాలీవుడ్ వర్గాల సమాచారమ్. ఇలా చెప్పుకుంటూ పోతే అసలింతకీ 'మణికర్ణిక' సినిమా వచ్చేదేనా? టోటల్‌గా సినిమా కూడా ఔటేనా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయ్.
ఈ సినిమా మొదట్నుంచీ కంగనా చాలా ఓవరాక్షన్ చేస్తోందంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అయితే సోనూసూద్ బయటికి వచ్చేయడంతో ఆ గాసిప్స్‌కి బలం చేకూరింది. చూడాలి మరి 'మణికర్ణిక' పరిస్థితేంటో.!