నందమూరి బాలకృష్ణ - పూరి జగన్నాథ్‌ల కాంబోలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకొన్నాడు. ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ మొదలు కానుంది. ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన టైటిళ్లు ప్రచారంలో ఉన్నాయి. ఆమధ్య టపోరి అనే టైటిల్ తెగ చక్కర్లు కొట్టింది. ఇప్పుడు.. మరో టైటిల్ వినిపిస్తోంది. అదే ఉస్తాద్. ఈ టైటిల్ ఇటీవలే పూరి రిజిస్టర్ చేయించాడని సమాచారం. అది.. బాలయ్యకూ బాగా నచ్చేసిందని, కథకు యాప్ట్‌గా ఉందని కితాబు ఇచ్చాడని తెలుస్తోంది. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ మొదలు కాబోతోంది. ఈలోగా టైటిల్‌ని అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి.