ఎన్టీఆర్‌ని బాల‌య్య ఆహ్వానించాడా?

By iQlikMovies - December 15, 2018 - 14:06 PM IST

మరిన్ని వార్తలు

బాల‌కృష్ణ - ఎన్టీఆర్ మ‌ధ్య కోల్డ్ వార్ న‌డిచింద‌న్న విష‌యం నంద‌మూరి అభిమానులే ఒప్పుకుంటారు. ఒక‌ప్పుడు ప్రేమ‌, ఆప్యాయ‌త‌లు కురిపించుకున్న వీరిద్ద‌రూ ఎందుక‌నో.. దూర‌మ‌య్యారు. హ‌రికృష్ఱ మ‌ర‌ణానంత‌రం  ఏర్ప‌డిన ప‌రిణామ‌ల దృష్ట్యా... మ‌ళ్లీ ఇద్ద‌రూ ఒక్క‌ట‌య్యార‌నిపించింది.  `అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌` ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కి వ‌చ్చిన బాల‌య్య‌...  నంద‌మూరి అభిమానుల్లో సంతోషం నింపాడు. ఆ త‌ర‌వాత మళ్లీ బాల‌య్య - ఎన్టీఆర్ క‌లిసిన సంద‌ర్భాలు లేవు. ఇప్పుడు.. మ‌రోసారి వీరిద్ద‌రినీ ఒకే వేదిక పై చూడ‌బోతున్నార‌ని టాక్‌.

 

నంద‌మూరి బాల‌కృష్ణ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న చిత్రం `ఎన్టీఆర్‌`. ఈ సంక్రాంతికి విడుద‌ల అవుతోంది. ఆడియో ఫంక్ష‌న్‌ని ఈనెల 21న నిమ్మ‌కూరులో నిర్వ‌హించ‌బోతున్నారు. ఈ పాట‌ల కార్య‌క్ర‌మానికి ఎన్టీఆర్ కుటుంబ స‌భ్యులు హాజ‌ర‌వుతార‌ని తెలుస్తోంది. ఆడియో ఫంక్ష‌న్‌కి ర‌మ్మ‌ని ఎన్టీఆర్‌కీ ఆహ్వానాలు అందాయ‌ని స‌మాచారం.  ఎన్టీఆర్‌ని ఆహ్వానించిన సంగ‌తి అధికారికంగా తెలియ‌క‌పోయినా - ఎన్టీఆర్ వచ్చే అవ‌కాశాలు మాత్రం పుష్క‌లంగా ఉన్నాయ‌ని నంద‌మూరి కాంపౌండ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అదే జ‌రిగితే ఈ ఆడియో ఫంక్ష‌న్‌కి మ‌రింత ఆక‌ర్ష‌ణ అబ్బిన‌ట్టే. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS