గ్లామ్‌షాట్‌: థాయ్ బికినీ గ్లామర్.. కిర్రాక్ సెక్సప్పీల్.!

By iQlikMovies - December 15, 2018 - 12:13 PM IST

మరిన్ని వార్తలు

నవ్వితే నవరత్నాలు రాలూ.. అంటారు. ఈ చక్కనమ్మ విరగబడి నవ్వితే, కుర్రకారు గుండెలు బేజారు అన్నట్లుంది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరంటే, నిఖిల్‌ హీరోగా తెరకెక్కిన 'కిర్రాక్‌ పార్టీ' సినిమాలో వన్‌ ఆఫ్‌ ది హీరోయినే ఈ హాటీ. పేరు సంయుక్తా హెగ్దే. తొలి సినిమానే అయినా క్యూట్‌ అండ్‌ నాటీ అప్పీల్‌తో సహజ నటన కనబర్చింది. ఫ్రీ స్టైల్‌ డాన్సులకు అమ్మడు పెట్టింది పేరు. అందుకే 'కిర్రాక్‌ పార్టీ'లో అలా డాన్సులు ఇరగదీసేసింది ఈ ముద్దుగుమ్మ.

ఇకపోతే ఆ సినిమాలో నేచురల్‌ బ్యూటీతో ఆకట్టుకున్న ఈ అందాల భామలో ఈ యాంగిల్‌ చూశారా.? కొంచెం వైల్డ్‌ యాంగిలే అయినా తనలో ఇలాంటి యాంగిల్‌ కూడా ఉందంటూ ఇదిగో ఇప్పుడే పరిచయం చేసింది. థాయ్‌లాండ్‌లో వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తూ బికినీలో అందాలారబోసిన పిక్స్‌ని ఇలా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. మీరూ ఓ లుక్కేస్కోండి బాసూ.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS