ఇది బాల‌య్య‌.. పూరీల‌ 'పీకే'నా?

మరిన్ని వార్తలు

నంద‌మూరి బాల‌కృష్ణ - పూరి జ‌గ‌న్నాథ్ ల కాంబినేష‌న్‌లో `పైసా వ‌సూల్` వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీసు ద‌గ్గ‌ర అనుకున్న ఫ‌లితం తీసుకురాలేక‌పోయింది గానీ, బాల‌య్య ఫ్యాన్స్‌కి విప‌రీతంగా న‌చ్చేసింది. పూరి స్టైల్ తో బాల‌య్య క‌నెక్ట్ అవ్వ‌డంతో వెంట‌నే మ‌రో సినిమా చేయ‌డానికి ఒప్పేసుకున్నాడు.

 

ఈ యేడాది బాల‌య్య - పూరి కాంబినేష‌న్‌లో ఓ సినిమా రానుంది. ఇప్ప‌టికే బాల‌య్య కోసం పూరి.. క‌థ రెడీ చేసేశాడ‌ట‌. ఇది `పీకే` స్టైల్ లో ఉంటుంద‌ని స‌మాచారం. అమీర్ ఖాన్ న‌టించిన `పీకే` గుర్తుంది క‌దా. బాలీవుడ్ లో సంచ‌ల‌న వ‌సూళ్లు అందుకుంది. ఓ గ్ర‌హాంత‌ర వాసి, భూమ్మీద‌కు వ‌చ్చి ప‌డిన క‌ష్టాల స‌మాహార‌మే... `పీకే`. ఇప్పుడు బాల‌య్య క‌థ కూడా ఇలానే ఉంటుంద‌ట‌. గ‌త జ‌న్మ‌లో చ‌క్ర‌వ‌ర్తిగా రాజ్యాలేలిన‌.. ఓ వ్య‌క్తి, అక‌స్మాత్తుగా ఈ భూమ్మీద మ‌ళ్లీ జ‌న్మిస్తే,.. త‌న‌ని పాత జ్ఙాప‌కాలు వెంటాడితే ఎలా ఉంటుంద‌న్న‌దే ఈ క‌థ‌. సోషియో ఫాంట‌సీ నేప‌థ్యంగా ఈసినిమా రూపుదిద్దుకోనుంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం పూరి `ఫైట‌ర్‌` తెర‌కెక్కించ‌డంలో బిజీగా ఉన్నాడు. అది పూర్త‌య్యాక ఓ పాన్ ఇండియా సినిమా చేయాలి. అది అయ్యాకే పూరి సినిమా మొద‌ల‌వుతుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS