సోనూసూద్ ని ఇలా చేశారేంటి?

మరిన్ని వార్తలు

కరోనా వ‌ల్ల - సోనూసూద్ ముఖ చిత్ర‌మే మారిపోయింది. ఈ క‌ష్ట‌కాలంలో.. ఆప‌ద్భాంధ‌వుడి అవ‌తారం ఎత్తిన సోనూ.. రీల్ లైఫ్ లో విల‌న్ అయినా, రియ‌ల్ లైఫ్ లో హీరోగా వెలుగొంతుతున్నాడు. ఒక‌ప్పుడు సోనూని విల‌న్ గా చూపిద్దామ‌నుకున్న ద‌ర్శ‌కులు, ఇప్పుడు త‌న‌లోని పాజిటీవ్ కోణాన్ని హైలెట్ చేద్దామ‌ని భావిస్తున్నారు. సోనూ హీరోగా సినిమాలూ మొద‌లైపోతున్నాయి.

 

లాక్ డౌన్ కంటే ముందు.. సోనూ న‌టించిన తెలుగు సినిమా `అల్లుడు అదుర్స్‌`. లాక్‌డౌన్ త‌ర‌వాత‌.. సోనూ పాత్ర‌లో భారీ మార్పులూ, చేర్పులూ చేశార‌ని, సోనూ సూద్ పాత్ర‌ని మొత్తంగా మార్చేశార‌ని, ఆ పాత్ర‌ని హైలెట్ చేస్తూ, హీరోకి స‌మానంగా తీర్చిదిద్దార‌ని వార్త‌లొచ్చాయి. `అల్లుడు అదుర్స్‌` ట్రైల‌ర్‌లో సైతం.. సోనూ పాత్ర‌ని హైలెట్ చేయ‌బోతున్నార‌ని చెప్పుకున్నారు. అయితే... `అల్లుడు అదుర్స్‌` లో మాత్రం సోనూ.. ఒక‌ట్రెండు ఫ్రేముల్లో క‌నిపించాడంతే. త‌న‌కు డైలాగులు కూడా లేవు. దాంతో.. సోనూ పాత్ర‌పై భారీ ఆశ‌లు, అంచ‌నాలు పెట్టుకున్న‌వాళ్లంతా షాక‌వుతున్నారు. కావాల‌నే సోనూ సూద్ పాత్ర‌ని దాచేశారా? లేదంటే.. నిజంగానే ఆ పాత్ర‌కు అంత స్కోప్ లేదా? అనే అనుమానాలూ వ్య‌క్తం అవుతున్నాయి. మ‌రి.. `అల్లుడు అదుర్స్‌` మేక‌ర్స్ స్ట్రాట‌జీ ఏమిటో తెలియాలంటే ఈనెల 15 వ‌ర‌కూ ఆగాలి. ఎందుకంటే అల్లుడు వ‌చ్చేది అప్పుడే మ‌రి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS