నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో బాలయ్య పాత్ర రెండు కోణాల్లో సాగుతుందని ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది. అఘోరాగా బాలయ్య కాసేపు కనిపిస్తాడని, ఆ ఎపిసోడ్ సినిమా మొత్తానికి హైలెట్ అని చెప్పుకున్నారు. అయితే రెండో పాత్ర ఎలా ఉంటుందన్న విషయంలో క్లారిటీ లేదు.
అయితే ఇప్పుడు ఆ పాత్ర గురించిన క్లూ దొరికూసింది. బాలయ్య ఇందులో కలెక్టర్గా అవతారం ఎత్తబోతున్నాడని విశ్వసనీయ వర్గాల టాక్. రైతుల కోసం పోరాడే కలెక్టర్ గా ఆ పాత్రని బోయపాటి తీర్చిదిద్దాడట. కలెక్టర్గా ప్రజలకు సేవ చేయాలని కథానాయకుడు భావించడం, అయితే ప్రభుత్వ యంత్రాంగం, చట్టాలు వాటికి అడ్డుపడడం చూసిన కథానాయకుడు, తన కలెక్టర్ గిరికి రాజీనామా చేసి, ఓ సామాన్యుడిగా.. ప్రజలకు సేవ చేయడం మొదలెడతాడట. కలెక్టర్గా బాలయ్య ఎవరిని ఎదిరించాడు? ఏం చేశాడు? అనేది మిగిలిన కథ. ఈ సినిమాకి `మోనార్క్` అనే టైటిల్ పరిశీలనలో వుంది.