సీనియర్ హీరోల్లో బాలయ్య స్పీడుని అందుకోవడం ఎవ్వరి వల్లా కావడం లేదు. సూపర్ స్పీడుతో బాలయ్య సినిమాలు చేస్తున్నారు. 100వ చిత్రం 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమా పూర్తి కాగానే వెంటనే పూరీతో సినిమా అనౌన్స్ చేసేశారు. పూరీతో 'పైసా వసూల్' సినిమా నిర్మాణం పూర్తి కావచ్చింది. రిలీజ్‌కి రెడీగా ఉంది. ఈ లోగానే 102వ చిత్రాన్ని లైన్‌లో పెట్టేశారు బాలయ్య. లైన్‌లో పెట్టడమేంటి ఏకంగా ప్రారంభోత్సవం కూడా జరిగిపోయింది. కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సి. కళ్యాణ్ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమాని 2018 సంక్రాంతికి విడుదల చేయనున్నారట. సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తానని పూరీ అనౌన్స్‌మెంట్ రోజే చెబితే, అంతకన్నా చాలా ముందే 'పైసా వసూల్' ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఈ సినిమా ఇంత స్పీడుగా కంప్లీట్ కావడానికి బాలయ్య స్పీడు, డెడికేషనే కారణమని అంటోంది చిత్ర యూనిట్. అలాగే ఇప్పుడు సెట్స్ మీదికి వెళ్లనున్న కొత్త సినిమా విషయంలో కూడా ఇదే సెంటిమెంట్ ఫాలో అవుతారా? చూడాలి మరి. ఈ సినిమాలో తనకి సెంటిమెంట్ అయిన హీరోయిన్ నయనతారని జోడీగా ఎంచుకున్నారు. ఈ సంక్రాంతికి 'శాతకర్ణి' సినిమాతో రేసులోకి దూసుకొచ్చి విన్నర్‌గా నిలచాడు. రాబోయే సంక్రాంతి రేసులో బాలయ్య మరోసారి కోడిపుంజులా దూసుకొచ్చి విజయాన్ని అందుకుంటాడేమో వెయిట్ అండ్ సీ.