దసరాకి బాలయ్య తాండవం

మరిన్ని వార్తలు

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనులది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. ఇప్పటివరకూ వచ్చిన మూడు సినిమాలు ఒకదానికి మించి ఒకటి హిట్ అయ్యాయి. ఇప్పుడు అఖండకి సీక్వెల్ అఖండ తాండవం సెట్స్ పైకి వెళ్ళింది.

ఈ రోజు బాలయ్య షూటింగ్ లో జాయిన్ అయ్యారు. బోయపాటి ఫైట్ సీక్వెన్స్ తో షూటింగ్ మొదలుపెట్టారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన గ్లింప్స్ లో సినిమా రిలీజ్ డేట్ కూడా ఇచ్చేశారు. 2025 దసరాని టార్గెట్ చేశారు బాలయ్య. సెప్టెంబర్ 25 సినిమా రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. దసరా బాలయ్యకి ఫేవరేట్ సీజన్. ఇప్పుడు అఖండ 2 ని కూడా అదే సీజన్ లో దించుతున్నారు.

అఖండ 2 పై భారీ అంచనాలు వున్నాయి. పైగా బాలయ్య, బోయపాటిలది తిరుగులేని కాంబినేషన్. ఈ సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే కంటెంట్ రెడీ చేశారు బోయపాటి. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS